-కరీంనగర్ జిల్లా శాఖ కృతజ్ఞతలు…
కరీంనగర్/ మే 09(మా అక్షరం):విధి నిర్వహానలో మరణించిన, అనారోగ్యాల గురైన జర్నలిస్టుల కుటుంబాలకు తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాదులో రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ ,సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన చనిపోయిన జర్నలిస్టు వెల్ఫేర్ ఫండ్ ద్వారా జర్నలిస్టుల కుటుంబాలకు 1లక్ష ఆర్థిక సహాయం 5సంవత్సరాలు నెలకు 3వేలు పెన్షన్ 10వ తరగతి లోపు చదివే పిల్లలకు ఉంటే ఒక్కొక్క వెయ్యి చొప్పున శాశ్వత అంగవైకల్యం పొందిన జర్నలిస్టులకు 1లక్ష చొప్పున అందిచడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడుతూ …జర్నలిస్టులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని త్వరలో అక్రిడిటేషన్ కార్డుల తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకి జిల్లా కలెక్టర్ లకు అదేశాలు జారీ చేస్తామన్నారు. కరీంనగర్ జిల్లాలో మృతి చెందిన నలుగురికి జర్నలిస్టుల కుటుంబాలకు, అనారోగ్యాల గురైన నలుగురు జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించారు. ఇటీవల మరణించిన పత్తి విష్ణువర్ధన్ రెడ్డి, అన్నేపాక సురేందర్, బాణాల శ్యాంసుందర్, ముజాహిద్ ఖాన్ కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు. శాశ్వత అంగవైకల్యం పొందిన జి. ఉదయకుమార్, పత్తి కొండారెడ్డి,ఉమ్మడి రాజేష్, జడల చిరంజీవి లకు లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సహాయాన్ని అందజేశారు.తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యూజే) కరీంనగర్ జిల్లా శాఖ అండగా నిలిచింది. తెలంగాణ మీడియా అకాడమీ నుండి అందించే ఆర్థిక సహాయానికి బాధిత కుటుంబాల చేత టీయూడబ్ల్యూజే దరఖాస్తులు సమర్పించింది. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కే. రాంనారాయణలతో పాటు ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎం.ఏ. మాజీద్, ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా నుండి అధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్ హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కాయిత రాములు ,కామని రవీందర్ పాల్గొని జర్నలిస్టులకు ఆర్దిక సహాయాన్ని అందజేసి ఆదుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.











