– ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కామని రవీందర్…
హుజురాబాద్/మే 10(మా అక్షరం): పత్రిక స్వేచ్ఛను హరించడం సరైంది కాదని, సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిపై పోలీసుల దాడి హేయమైన చర్య అని టియుడబ్ల్యూజే (ఐజెయు) జిల్లా ఉపాధ్యక్షులు నంబి భరణి కుమార్, హుజురాబాద్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కామని రవీందర్ లు అన్నారు. ధనుంజయ రెడ్డి ఇంటిపై ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు దాడి చేయడం నిరసిస్తూ స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో శనివారం జర్నలిస్టులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిజం ప్రత్యేక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు సాక్షి ఎడిటర్ ఇంటిపై దాడి చేయడం ఏంటని వారు ప్రశ్నించారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాత్రికేయులపై దాడులు మానుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు
చిరుకమరి సత్యరాజ్, ముష్కే శ్రీనివాస్, మచ్చిక చందు, పడాల రమేష్, కేదాసి శ్రీధర్, బత్తుల రాజలింగం, టేకుల సాగర్,ఆర్షల్ అజీమ్, కుడికాల సాయి, మంతెన కిరణ్ బాబు,ఫహీం, నాగవెల్లి రాజు, భారత రజనీకాంత్, గోస్కుల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.











