+91 99635 77856

శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామికి హుజురాబాద్ వాసుల ఘన స్వాగతం

Kudikala Sai Editor
maaksharamnews.in

శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామికి హుజురాబాద్ వాసుల ఘన స్వాగతం

– ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి...

హుజురాబాద్/ మే 20 (మా అక్షరం):పట్టణానికి తొలిసారి విచ్చేస్తున్న శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారికి ఘనంగా స్వాగతం పలకాలని స్థానిక ఎమ్మెల్యే శ్రీ పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈనెల 22వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు స్వామివారు హుజురాబాద్ రామాలయ దర్శనానికి రానున్నారు.ఈ సందర్భంగా మంగళవారం ఆలయ పరిసరాల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. చిన్న జీయర్ స్వామివారి పుణ్యదర్శనం హుజురాబాద్‌కు ఒక మహాశుభ సందర్భమని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు.ప్రత్యేకించి, ఎవరికీ ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేయాలని అధికారులకు సూచించారు. మున్సిపల్ కమిషనర్‌కు ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ వ్యవస్థలో అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు.భక్తుల రాకపోకల దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, తాగునీరు, వైద్య సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, టౌన్ సీఐ కరుణాకర్, ఎలక్ట్రికల్ విభాగం అధికారులు, బీఆర్ఎస్ నాయకులు గందే శ్రీనివాస్, కొలిపాక శ్రీనివాస్, సురేందర్ రెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్ పూర్ణచందర్, ముత్యం రాజు, రమేష్ తదితర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

– ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !