+91 99635 77856

గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయాలు…

Kudikala Sai Editor
maaksharamnews.in

గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయాలు…

-చికిత్స పొందుతూ మృతి..కందుగుల వద్ద ఘటన....

హుజూరాబాద్/ జూన్ 24 (మా అక్షరం):
పరకాల-హుజూరాబాద్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జూన్ 20వ తేదీ రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో కరీంనగర్ జిల్లాలోని కందుగుల గ్రామ శివారులో సాయిరాం రైస్ మిల్లు సమీపంలో ఉన్న రహదారిపై ఒక వ్యక్తి గాయాలపాలై ఉండటం గుర్తించారు. ఆయన వయస్సు సుమారు 35 సంవత్సరాలుగా అంచనా వేయబడుతోంది.ఆ వ్యక్తి AP 13 S 7055 నంబర్ ఉన్న ఎరుపు రంగు హోండా ద్విచక్ర వాహనం పై ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో ఉన్న మిల్లులో పనిచేసే వారు అతన్ని 108 అంబులెన్స్ ద్వారా హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, జూన్ 23వ తేదీ రాత్రి 8:30 గంటల సమయంలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు.చనిపోయిన వ్యక్తి పూర్తి వివరాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. అతని గురించి ఎవరైనా సమాచారం కలిగి ఉంటే హుజూరాబాద్ పోలీస్ స్టేషన్‌ ను సంప్రదించవచ్చు అని ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తెలిపారు. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్,87126 70773ఎస్సై యునెస్ అహ్మద్ అలీ 75699 19123

Share ePaper Clip

Preparing image...

-చికిత్స పొందుతూ మృతి..కందుగుల వద్ద ఘటన….

హుజూరాబాద్/ జూన్ 24 (మా అక్షరం):
పరకాల-హుజూరాబాద్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జూన్ 20వ తేదీ రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో కరీంనగర్ జిల్లాలోని కందుగుల గ్రామ శివారులో సాయిరాం రైస్ మిల్లు సమీపంలో ఉన్న రహదారిపై ఒక వ్యక్తి గాయాలపాలై ఉండటం గుర్తించారు. ఆయన వయస్సు సుమారు 35 సంవత్సరాలుగా అంచనా వేయబడుతోంది.ఆ వ్యక్తి AP 13 S 7055 నంబర్ ఉన్న ఎరుపు రంగు హోండా ద్విచక్ర వాహనం పై ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో ఉన్న మిల్లులో పనిచేసే వారు అతన్ని 108 అంబులెన్స్ ద్వారా హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, జూన్ 23వ తేదీ రాత్రి 8:30 గంటల సమయంలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు.చనిపోయిన వ్యక్తి పూర్తి వివరాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. అతని గురించి ఎవరైనా సమాచారం కలిగి ఉంటే హుజూరాబాద్ పోలీస్ స్టేషన్‌ ను సంప్రదించవచ్చు అని ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తెలిపారు. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్,87126 70773ఎస్సై యునెస్ అహ్మద్ అలీ 75699 19123

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !