-9 రోజుల్లో 9 వేల కోట్లతో రైతులకు భరోసా…
హుజురాబాద్ /జూన్ 24 (మా అక్షరం):
ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన “రైతు భరోసా సంబరాలు” హుజురాబాద్ నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం కేవలం 9 రోజుల వ్యవధిలో 9 వేల కోట్ల రూపాయలు విడుదల చేయడం పట్ల, ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రైతులకు వివిధ సంక్షేమ పథకాల వివరాలు తెలియజేయడంతో పాటు,రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ పట్టణ ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 188











