+91 99635 77856

ప్రభుత్వ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలి

-విద్యా వ్యాపారం చేస్తు తల్లి దండ్రులను ఇబ్బందులు పెడితే ఊరుకోం..

ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్…

హుజురాబాద్/ జూన్ 27 (మా అక్షరం): పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని, మధ్యాహ్నం భోజనం పథకం అమలు చేయాలని, అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ అన్నారు. శుక్రవారం అఖిల భారత విద్యార్థి సమైక్య జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి, విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మండల కార్యదర్శి రాంపెల్లి రోహిత్ అధ్యక్షతన ఏఐఎస్ఎఫ్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక మండల కేంద్రంలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ కళాశాలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలను అభివృద్ధి పరిచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ కళాశాలల్లో సైన్స్ విద్యార్థులకు ల్యాబ్స్, ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా కంప్యూటర్స్ లాంటి పరికరాలను అందుబాటులో ఉంచి నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోని ప్రైవేట్ కళాశాలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.విద్యార్థులు లేరనే సాకుతో ప్రభుత్వం 12ఎస్సీ గురుకుల ఇంటర్ కళాశాలలను మూసివేసే నిర్ణయాన్ని మానుకోవాలన్నారు.
హుజరాబాద్ లో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పాఠశాలల వ్యాపార కేంద్రాలుగా మారాయని తమ వద్దనే పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ టై బెల్ట్ ఇతర వస్తువులు కొనాలని విద్యార్థులను తల్లిదండ్రులను ఒత్తిళ్లకు గురిచేస్తున్నాయని విద్యాశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు రాహుల్, గణేష్, పృధ్వీ, శ్రీకాంత్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !