+91 99635 77856

అల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో వైభవంగా బోనాల జాతర

Kudikala Sai Editor
maaksharamnews.in

అల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో వైభవంగా బోనాల జాతర

-పోతురాజుల ఉత్సాహం... విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్న వేడుక...

హుజురాబాద్/జూలై 07(మా అక్షరం):తెలంగాణ సాంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే బోనాల పండుగను హుజురాబాద్ సమీపంలోని బండ అంకూస్ వాడలో గల అల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో సోమవారం రోజు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు.ఉత్సవం ప్రారంభానికి ముందు ఆలయం అలంకరించబడిన అమ్మవారి విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డా. నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా గుర్తింపు తీసుకురావడంలో బోనాల పండుగ పాత్ర అనిర్వచనీయం మనీ ఇది మతసామరస్యానికి నాంది పలికే పండుగ పేర్కొన్నారు.అలానే మాసంలో జరుపుకునే ఈ బోనాల ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా నెలరోజులపాటు ఉత్సాహభరితంగా జరుపుకుంటారు. హైదరాబాద్ నగరంలో జరిగే సంబరాలు ఎంతో వైభవంగా ఉంటాయి అని తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన అమ్మవారి నృత్యాలు, పోతురాజుల విన్యాసాలు, గ్రామదేవతల వైభవం ఆధారంగా రూపొందించిన నృత్యాలన్నీ కార్యక్రమానికి హైలైట్‌గా నిలిచాయి. సుమారు 100 మంది విద్యార్థులు రకరకాల సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొని పాఠశాల ఆవరణను పండుగ వాతావరణంగా మలచారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-పోతురాజుల ఉత్సాహం… విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్న వేడుక…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !