హుజురాబాద్/ జులై 11(మా అక్షరం):ఆషాడ మాసం పురస్కరించుకొని పట్టణంలోని కాకతీయ కాలనీలో గల మాంటిస్సోరి పాఠశాలలో గోరింటాకు పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని బాలికలు గోరింటాకును వారి చేతులకు అందంగా అలంకరించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు గీతాషాజు మాట్లాడుతూ… స్త్రీలకు అత్యంత ఇష్టమైన గోరింటాకు పండగ జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు .ఈ గోరింటాకులో ఆరోగ్యానికి కావలసిన ఔషధ లక్షణాలు ఉన్నాయని పిల్లలకు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 205











