+91 99635 77856

చదువుతోపాటు సాంస్కృతిక రంగాల్లో కూడా రాణించాలి…

హుజూరాబాద్ /జూలై 16 (మా అక్షరం):విద్యార్థులు చదువుతోపాటు క్రీడా సాంస్కృతిక తదితర రంగాల్లో రాణించాలని మాంటిసోస్సోరి పాఠశాల ప్రిన్సిపాల్ గీతా రాజు అన్నారు.బుధవారం పట్టణంలోని కాకతీయ కాలనీలో గల మాంటిస్సోరి పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న కె. రియాన్షిత ఇటీవల నృత్య ప్రదర్శనలో రాణించి శ్రీ నాట్యరవలి 2025 పురస్కారాన్ని అందుకోవడాన్ని పురస్కరించుకొని పాఠశాలలో ఆమెకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… విద్యార్థులు బట్టి చదువులతో గడపకుండా తమలోని సృజనాత్మకతను బయటికి తీసి అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ షాజూ థామస్ ఫ్లోర్ ఇన్చార్జులు సంధ్య, శ్రావణి తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !