+91 99635 77856

హుజురాబాద్ టెన్త్ విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ నేడు…

-మోదీ కానుకగా టెన్త్ క్లాస్ విద్యార్ధినీ, విద్యార్థులందరికీ సైకిళ్లు అందజేయనున్న కేంద్ర మంత్రి బండి సంజయ్..
-బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి..

హుజరాబాద్/ జూలై 17 (మా అక్షరం): కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుకునే విద్యార్ధినీ, విద్యార్థులందరికీ ఉచింగా సైకిళ్లను పంపణీ చేస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ నెల 17న గురు వారం హుజురాబాద్ నియోజకవర్గ సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. హుజురాబాద్ లో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం కోసం హై స్కూల్ గ్రౌండ్ లో జరుగుతున్న ఏర్పాట్ల పనులను బుధవారం రోజున స్థానిక బిజెపి శ్రేణులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గురువారం రోజున ఉదయం 10 గంటలకు హుజురాబాద్ పట్టణంలోని హై స్కూల్ గ్రౌండ్లో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ప్రభుత్వ పాఠశాల పదోతరగతి విద్యార్థినీ విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేస్తారని తెలిపారు. ప్రధానమంత్రి ‘‘నరేంద్రమోదీ కానుక’’ పేరుతో చేస్తున్న ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటుగా పలువురు అధికారులు, నాయకులు హాజరుకానున్నారనీ తెలిపారు. బండి సంజయ్ కుమార్ స్వయంగా వివిధ సంస్థల నుండి సేకరించిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్సార్) నిధులతో ఈ సైకిళ్లను కొనుగోలు చేసి పేద విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారని తెలిపారు.కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో దాదాపు 25 వేల సైకిలను కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ విద్యార్థినీ విద్యార్థులకుఅందించనున్నారన్నారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని జిల్లా కేంద్రాలు , అన్ని మండల కేంద్రాల్లోనూ, గ్రామ పంచాయతీల వారిగా సైకిళ్లను పంపిణీ జరుగుతుందని , కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 25 వేల సైకిళ్లను దశలవారీగా పంపిణీ చేసేందుకు ప్రణాళికను రూపొందించారని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థినీ విద్యార్థులు పేద కుటుంబం నుండి వచ్చిన వాళ్లే అధిక శాతం ఉంటారని , ఆ పిల్లలు తమ ఇంటి నుండి స్కూల్ దాకా వెళ్లడానికి తగిన రవాణా సౌకర్యాల్లేక, ఆటోలు, బస్సులు వెళ్లే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.విద్యార్థుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని టెన్త్ బాలబాలికలకు రవాణా ఇబ్బంది ఉండకూడదనే సదుద్దేశంతో బండి సంజయ్ కుమార్ ప్రధాని మోదీ కానుకగా సైకిళ్లను పంపిణీ చేస్తున్నారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, జిల్లా సెక్రెటరీ నరసింహరాజు, హుజురాబాద్ మండల అధ్యక్షుడు రాముల కుమార్, హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, జమ్మికుంట రూరల్ పట్టణ అధ్యక్షులు సంపెల్లి సంపత్ రావు, జిల్లా జనరల్ సెక్రెటరీ ఆకుల రాజేందర్ ,హుజురాబాద్ పట్టణ మాజీ ఫ్లోర్ లీడర్ వెంకటరెడ్డి,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !