+91 99635 77856

ఎలుకలు కరిచిన ఘటనపై ఎమ్మెల్యే స్పందన

Kudikala Sai Editor
maaksharamnews.in

ఎలుకలు కరిచిన ఘటనపై ఎమ్మెల్యే స్పందన

-ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి...
-ప్రభుత్వంపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మండిపాటు..

హుజురాబాద్/ జూలై 29 (మా అక్షరం):
సైదాపూర్‌ ఎంజిపి గురుకుల పాఠశాలలో విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘటనపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. మంగళవారం పాఠశాలను సందర్శించి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, పిల్లలపై ఎలుకలు దాడిచేయడం చాలా దారుణం. పాఠశాల ప్రిన్సిపాల్ రాణి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇలాంటి ఘోర ఘటనపై చర్యలు తీసుకోకపోతే విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్నారు.మీ పిల్లలకు ఇలా జరిగితే ఊరుకుంటారా? అని ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించారు.గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు ఉండేవని, ఒక్క విద్యార్థిపై రూ.1.25 లక్షలు ఖర్చు చేసి విద్యాభివృద్ధికి కృషి చేశారని చెప్పారు. ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్యమంత్రి చేతిలో ఉండటంతో పేద విద్యార్థులపై అన్యాయంజరుగుతుందన్నారు.ప్రపంచ సుందరీ పోటీల్లో పాల్గొనేవారికి లక్ష రూపాయల భోజనాలు పెట్టే ప్రభుత్వం, పేద విద్యార్థులకు నాసిరకం భోజనం పెడుతుందా? అని ప్రశ్నించారు. ఈ ఘటనలో బాధ్యత వహించిన ప్రిన్సిపాల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Share ePaper Clip

Preparing image...

-ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !