+91 99635 77856

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రణవ్ తనిఖీ

-ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రణవ్ తనిఖీ…
-వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం…

హుజురాబాద్/జూలై 30 (మా అక్షరం):వైద్య రంగాన్ని ప్రాధాన్యతా రంగంగా పరిగణిస్తూ ఆసుపత్రుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ తెలిపారు. బుధవారం ఆయన హుజురాబాద్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆసుపత్రిలో శానిటేషన్, మెయింటెనెన్స్ స్థితిగతులపై అధికారులను ప్రశ్నించిన ఆయన, రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలపై డాక్టర్లతో చర్చించారు. అనంతరం మాట్లాడిన ఆయన… “ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతోనే ప్రభుత్వం ముందడుగు వేస్తుందని,రోగులకు మరింత భరోసా కలిగించేలా డాక్టర్లు సేవలు అందించాలని,ఇటీవలే ఆసుపత్రిలో 100 డెలివరీలు జరగడం ఇదే అంశానికి నిదర్శనం” అన్నారు.ఇప్పటికే ఎస్‌డీఎఫ్‌ నిధుల ద్వారా హుజురాబాద్, జమ్మికుంట ఆసుపత్రులకు చెరో రూ.15 లక్షలు చొప్పున మొత్తం రూ.30 లక్షలు కేటాయించామని, ఆయా అభివృద్ధి పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. డాక్టర్ల కొరత ఉండకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు కలెక్టర్‌, డీఎంహెచ్‌వోలతో చర్చించినట్లు తెలిపారు.ఆసుపత్రి అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలుస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ నారాయణ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !