+91 99635 77856

గద్దర్ రెండో వర్ధంతి సభను విజయవంతం చేయాలి…

-గద్దర్ రెండో వర్ధంతి సభను విజయవంతం చేయాలి…
-శనిగరం బాబ్జి పిలుపు…
​హుజురాబాద్/ ఆగస్టు 04 (మా అక్షరం): ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ రెండో వర్ధంతిని విజయవంతం చేయాలని తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శనిగరం బాబ్జి పిలుపునిచ్చారు. ఈనెల 8న హుజురాబాద్‌ పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్లో జరగనున్న ఈ సభకు పెద్ద సంఖ్యలో అభిమానులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొనాలని ఆయన కోరారు.​సోమవారం హుజురాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పీడిత, తాడిత ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గద్దర్‌కు ఘన నివాళులు అర్పించాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గద్దర్ కుమార్తె, తెలంగాణ సాంస్కృతి సారథి చైర్మన్ డాక్టర్ వెన్నెల గద్దర్, ప్రధాన వక్తగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ చింతకింది కాసిం హాజరవుతారని తెలిపారు.​ఈ సందర్భంగా, పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కళాకారులచే గద్దర్‌కు ఆట, పాటల రూపంలో నివాళి కార్యక్రమం ఉంటుందని, అనంతరం అక్కడి నుండి సిటీ సెంట్రల్ హాల్ వరకు ర్యాలీగా వెళ్తామని ఆయన వివరించారు. కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, విద్యావంతులు, ప్రజాసంఘాల నాయకులు ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొని గద్దర్ ఆశయాలను స్మరించుకోవాలని బాబ్జి కోరారు. ఈ సమావేశంలో ద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు రామంచ భరత్, డప్పు వాయిద్య కారుడు ఎర్ర సురేష్, ప్రముఖ గాయకుడు రావుల సాయి పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !