+91 99635 77856

శాంతి భద్రతలకై కార్డెన్ సర్చ్

Kudikala Sai Editor
maaksharamnews.in

శాంతి భద్రతలకై కార్డెన్ సర్చ్

హుజురాబాద్/ ఆగస్టు 07(మా అక్షరం): శాంతి భద్రతల పరిరక్షణకు భాగంగా పట్టణంలోని మామిండ్లవాడ కాలనీలో గురువారం భారీగా కార్డెన్ సర్చ్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు అడిషనల్ డీసీపీ వెంకటరమణ తెలిపారు.ఈ సందర్భంగా పోలీసులు పలు ఇళ్లలో తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలు లేని 55 ద్విచక్ర వాహనాలు, 9 ట్రాక్టర్లు, 7 ఆటోలు, 3 కార్లు, 2 బొలెరో వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అన్నారు. అద్దెకు ఇచ్చే ముందు గుర్తింపు పత్రాలు పరిశీలించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100 నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.ఈ తనిఖీల్లో ఏసీపీ వాసంశెట్టి మాధవి, నలుగురు సీఐలు, ఏడుగురు ఎస్సైలు, సుమారు 100 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్/ ఆగస్టు 07(మా అక్షరం): శాంతి భద్రతల పరిరక్షణకు భాగంగా పట్టణంలోని మామిండ్లవాడ కాలనీలో గురువారం భారీగా కార్డెన్ సర్చ్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు అడిషనల్ డీసీపీ వెంకటరమణ తెలిపారు.ఈ సందర్భంగా పోలీసులు పలు ఇళ్లలో తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలు లేని 55 ద్విచక్ర వాహనాలు, 9 ట్రాక్టర్లు, 7 ఆటోలు, 3 కార్లు, 2 బొలెరో వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అన్నారు. అద్దెకు ఇచ్చే ముందు గుర్తింపు పత్రాలు పరిశీలించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100 నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.ఈ తనిఖీల్లో ఏసీపీ వాసంశెట్టి మాధవి, నలుగురు సీఐలు, ఏడుగురు ఎస్సైలు, సుమారు 100 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !