+91 99635 77856

ఎస్సారెస్పీ కాలువల ద్వారా రైతులకు సాగునీరు అందించాలి.

-ఎస్సారెస్పీ కాలువల ద్వారా రైతులకు సాగునీరు అందించాలి…
-వృథాగా పోతున్న నీటిని మిడ్‌మానేరు నింపాలి…
-హుజురాబాద్‌ సింగిల్ విండో చైర్మన్‌ ఎడవెల్లి కొండల్‌ రెడ్డి…

హుజురాబాద్‌/ ఆగస్ట్ 21 (మా అక్షరం): ఎస్సారెస్పీ నిండిపోవడంతో వృథాగా సముద్రంలో కలుస్తున్న సాగునీటిని మిడ్‌మానేరు డ్యాం నింపి, అక్కడి నుంచి కాలువల ద్వారా రైతులకు నీరు అందించాలని హుజురాబాద్‌ సింగిల్ విండో అధ్యక్షుడు, సహకార సంఘాల అధ్యక్షుల అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఎడవెల్లి కొండల్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ ప్రాజెక్టులు నిండిపోవడంతో గేట్లు ఎత్తివేయడం వల్ల రైతులకు ఉపయోగపడాల్సిన నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులు కాలువలపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారని, సకాలంలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నీటిని వృథా కాకుండా ఎస్సారెస్పీ కాలువల ద్వారా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.అలాగే రైతులకు సరిపడా యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతుల అవసరాలకు అనుగుణంగా తగిన యూరియా అందించకపోతే, రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !