+91 99635 77856

ప్రభుత్వ ఆసుపత్రిని ప్రణవ్ ఆకస్మికంగా తనిఖీ

Kudikala Sai Editor
maaksharamnews.in

ప్రభుత్వ ఆసుపత్రిని ప్రణవ్ ఆకస్మికంగా తనిఖీ

హుజురాబాద్/ఆగస్టు 21(మా అక్షరం): వైద్యం కోసం వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని,ప్రభుత్వం వైద్య రంగానికి సంబంధించి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని,దాంట్లో భాగంగా హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయో తెలుసుకోవడానికి తనిఖీ చేశామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ అన్నారు.గురువారం పట్టణంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.దవాఖానలో ఎలాంటి చికిత్స అందిస్తున్నారని,ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేరుగా రోగులను అడిగి తెలుసుకున్నారు.నిన్నటిదాకా వర్షాభావ పరిస్థితుల వల్ల రోగాలు ప్రబలే అవకాశం ఉందని,రోగాల బారిన పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.తనిఖీ చేసే సమయంలో పలు సమస్యలు ప్రణవ్ దృష్టికి తీసుకురాగా వాటిని అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రణవ్ వెంట కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !