+91 99635 77856

తెలంగాణ సమాజంపై మార్వాడీల కత్తి

Kudikala Sai Editor
maaksharamnews.in

తెలంగాణ సమాజంపై మార్వాడీల కత్తి

-తెలంగాణ సమాజంపై మార్వాడీల కత్తి...
-ఓయు జెఏసి బంద్ కు విశ్వకర్మల సంపూర్ణ మద్దతు..

హుజురాబాద్/ ఆగస్టు 21(మా అక్షరం): తెలంగాణ సమాజం పై మార్వాడీలు కత్తి పెట్టారని విశ్వకర్మ సంఘం మండల అధ్యక్షులు తాటికొండ శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మార్వాడి వ్యాపారాలు చేసే వ్యాపారాల వల్ల విశ్వకర్మల వృత్తి పూర్తిగా దెబ్బతింటున్నదని మండిపడ్డారు. మార్వాడీలు విశ్వకర్మల వృత్తిని కబళిస్తున్నారని దీంతో తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. మార్వాడీలు అన్ని రకాల వ్యాపారాలు చేస్తూ నాణ్యతలేని నాసిరకం వస్తువులు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో ఈ ప్రాంత వ్యాపారుల వ్యాపారాలు క్షీణించడానికి కారకులవుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. మన ప్రాంతం మన వ్యాపారం అనే నినాదంతో ముందుకు పోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. మార్వాడీల గో బ్యాక్ ఉద్యమానికి ఓయూ జెఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఇచ్చిన రాష్ట్ర బంద్ కు విశ్వకర్మల సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.ఈ సమావేశంలో విశ్వకర్మ సంఘం నాయకులు నందగిరి శ్రీనివాస్, రాంపల్లి బిక్షపతి, వేము నూరి శ్రీనివాస్, చల్లూరి రఘు, బాణాల సత్యం, నందా చారి, బిక్షపతి ,పంచకోటి సత్యనారాయణ, బండ్లోజు లింగమూర్తి, రాంపల్లి రాజ్ కుమార్, నాంపల్లి మహేందర్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

-తెలంగాణ సమాజంపై మార్వాడీల కత్తి…
-ఓయు జెఏసి బంద్ కు విశ్వకర్మల సంపూర్ణ మద్దతు..

హుజురాబాద్/ ఆగస్టు 21(మా అక్షరం): తెలంగాణ సమాజం పై మార్వాడీలు కత్తి పెట్టారని విశ్వకర్మ సంఘం మండల అధ్యక్షులు తాటికొండ శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మార్వాడి వ్యాపారాలు చేసే వ్యాపారాల వల్ల విశ్వకర్మల వృత్తి పూర్తిగా దెబ్బతింటున్నదని మండిపడ్డారు. మార్వాడీలు విశ్వకర్మల వృత్తిని కబళిస్తున్నారని దీంతో తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. మార్వాడీలు అన్ని రకాల వ్యాపారాలు చేస్తూ నాణ్యతలేని నాసిరకం వస్తువులు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో ఈ ప్రాంత వ్యాపారుల వ్యాపారాలు క్షీణించడానికి కారకులవుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. మన ప్రాంతం మన వ్యాపారం అనే నినాదంతో ముందుకు పోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. మార్వాడీల గో బ్యాక్ ఉద్యమానికి ఓయూ జెఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఇచ్చిన రాష్ట్ర బంద్ కు విశ్వకర్మల సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.ఈ సమావేశంలో విశ్వకర్మ సంఘం నాయకులు నందగిరి శ్రీనివాస్, రాంపల్లి బిక్షపతి, వేము నూరి శ్రీనివాస్, చల్లూరి రఘు, బాణాల సత్యం, నందా చారి, బిక్షపతి ,పంచకోటి సత్యనారాయణ, బండ్లోజు లింగమూర్తి, రాంపల్లి రాజ్ కుమార్, నాంపల్లి మహేందర్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !