-ఈటెల రాజేందర్ ముఖ్య అనుచరులు బిఆర్ఎస్ పార్టీ లో చేరిక…
హుజురాబాద్/ఆగస్టు 20(మా అక్షరం): హుజురాబాద్ రాజకీయాల్లో మరో మలుపు నమోదైంది.ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యం లో ప్రజా సేవ పట్ల ఆయన చూపుతున్న ప్రేమ, బిఆర్ఎస్ పార్టీ నే తెలంగాణకు శ్రీరామ రక్షా కెసిఆర్ మళ్ళి తెలంగాణకు ముఖ్యమంత్రి కావలి అనే లక్ష్యంతో జూపాక సింగిల్ విండో చైర్మన్ అనుమళ్ల శ్యాంసుందర్ రెడ్డి, కట్కూరి మల్లారెడ్డి, ఉప సర్పంచ్ కట్కూరి కోమల్ రెడ్డి, సీనియర్ నాయకులు అనుమళ్ల రాజిరెడ్డి బిజెపి పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో బుధవారం చేరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…భాజపా పార్టీ ప్రజల కోసం ఏం చేయలేక పోయిందని,హుజురాబాద్ అభివృద్ధి కేవలం కౌశిక్ రెడ్డి నాయకత్వంలోనే సాధ్యమవుతుందని, ప్రజా సంక్షేమం పట్ల ఆయన చూపుతున్న నాయకత్వం మాకు ఎంతో నమ్మకం కలిగించిందని అందుకే మేమంతా ఏకగ్రీవంగా బిఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నామని రానున్న రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కష్టపడతామని తెలిపారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజల కోసం నా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని, బిఆర్ఎస్ పార్టీ లో చేరిన నాయకులకు శుభాకాంక్షలు తెలుపుతూ అందరం కలిసి స్థానిక సంస్థలో హుజురాబాద్ లో బిఆర్ఎస్ జండా ఎగరవేస్తామని, బిఆర్ఎస్ పార్టీ శక్తి మరింతగా పెరిగి, ప్రజా ఆశయాలు నెరవేరే దిశలో ముందుకు సాగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్,మాజీ ఎంపీపీ సురేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గందె రాధిక- శ్రీనివాస్ సీనియర్ నాయకులు శాంతన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.











