+91 99635 77856

ప్రభుత్వ జూనియర్ కళాశాల పరిశీలన

Kudikala Sai Editor
maaksharamnews.in

ప్రభుత్వ జూనియర్ కళాశాల పరిశీలన

హుజూరాబాద్ /ఆగస్టు 20 (మా అక్షరం): పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న మైనర్ రిపేర్ పనులను పరిశీలించారు. కళాశాలలో మీటింగ్ హాల్ లేకపోవడంతో ఆడిటోరియం నిర్మాణం అవసరాన్ని ప్రిన్సిపాల్ వి.ఆంజనేయరావు వివరించారు. అలాగే గ్రిల్స్, మెట్లు, ఫ్యాన్లు, విద్యుత్ పనులపై కూడా సమాచారం అందించారు.తరువాత విద్యార్థులకు స్టాఫ్ క్లబ్ ఆధ్వర్యంలో ఐడీ కార్డులను ఉచితంగా పంపిణీ చేశారు. విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరవుతూ పాఠాలను అభ్యసించి ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు.తర్వాత మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ఆధ్వర్యంలో కళాశాల ఆవరణలో పిచ్చి మొక్కలు, చెత్త తొలగింపు కార్యక్రమం నిర్వహించి సుమారు 250 మొక్కలను నాటారు. అనంతరం అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌లను కళాశాల ప్రిన్సిపాల్ శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో లెక్చరర్లు కె.సుగుణ, ప్రసాద్, జీ.తులసీదాస్, కె.వి.వాసుదేవరావు, కె.మురళీమోహన్, జై విజేందర్ రెడ్డి, మల్లారెడ్డి, సుహాసిని, లైబ్రేరియన్ రాజేశం, వెంకటరమణ, రాజేందర్, రహీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !