+91 99635 77856

ప్రధాని మోదీ తల్లిపై దూషణలు కాంగ్రెస్ సంస్కారానికి నిదర్శనం

Kudikala Sai Editor
maaksharamnews.in

ప్రధాని మోదీ తల్లిపై దూషణలు కాంగ్రెస్ సంస్కారానికి నిదర్శనం

హుజురాబాద్/ఆగస్టు30(మా అక్షరం):ప్రధాని మోదీ మాతృమూర్తి గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్‌లోని సభలో చేసిన అసభ్యకర వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ సంస్కారానికి నిదర్శనమని హుజురాబాద్ బిజెపి నాయకులు విమర్శించారు. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ పట్టణ బిజెపి శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చౌరస్తాలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ శనివారం దహనం చేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ...మోదీ తల్లిపై కాంగ్రెస్ నేతల దూషణలు ఆ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. రాహుల్ గాంధీ వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పేదరికంలో పెరిగి మోదీకి విలువలు నేర్పిన తల్లిని అవమానించడం దేశ ప్రజల మనసులను ద్రవింపజేస్తుందన్నారు. ఒక పేద తల్లి కుమారుడు పదకొండేళ్లుగా ప్రధానిగా కొనసాగడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేక ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతోందని తీవ్రంగా ఆక్షేపించారు. మోదీ మాతృమూర్తిని దూషించిన కాంగ్రెస్ వ్యాఖ్యలను ప్రజలు ఖండించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు తూముల శ్రీనివాస్, పట్టణ మాజీ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, మాజీ కౌన్సిలర్ నల్ల సుమన్, సీనియర్ నాయకులు నరాల రాజశేఖర్, తిప్పబత్తిని రాజు, అంకటి వాసు, హజార్ యాల సంజీవరెడ్డి, బోరగాల సారయ్య, మోతే తిరుపతి, కొలిపాక వెంకటేష్, కొడిమ్యాల పవన్, భాస్కర్ యాదవ్, డోరి ఐలయ్య, బిమోజ్ వెంకట్, క్యాష్ వెంకటేష్, మోసం వెంకటేశ్వర్లు, తాళ్లపెళ్లి హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్/ఆగస్టు30(మా అక్షరం):ప్రధాని మోదీ మాతృమూర్తి గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్‌లోని సభలో చేసిన అసభ్యకర వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ సంస్కారానికి నిదర్శనమని హుజురాబాద్ బిజెపి నాయకులు విమర్శించారు. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ పట్టణ బిజెపి శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చౌరస్తాలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ శనివారం దహనం చేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ…మోదీ తల్లిపై కాంగ్రెస్ నేతల దూషణలు ఆ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. రాహుల్ గాంధీ వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పేదరికంలో పెరిగి మోదీకి విలువలు నేర్పిన తల్లిని అవమానించడం దేశ ప్రజల మనసులను ద్రవింపజేస్తుందన్నారు. ఒక పేద తల్లి కుమారుడు పదకొండేళ్లుగా ప్రధానిగా కొనసాగడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేక ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతోందని తీవ్రంగా ఆక్షేపించారు. మోదీ మాతృమూర్తిని దూషించిన కాంగ్రెస్ వ్యాఖ్యలను ప్రజలు ఖండించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు తూముల శ్రీనివాస్, పట్టణ మాజీ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, మాజీ కౌన్సిలర్ నల్ల సుమన్, సీనియర్ నాయకులు నరాల రాజశేఖర్, తిప్పబత్తిని రాజు, అంకటి వాసు, హజార్ యాల సంజీవరెడ్డి, బోరగాల సారయ్య, మోతే తిరుపతి, కొలిపాక వెంకటేష్, కొడిమ్యాల పవన్, భాస్కర్ యాదవ్, డోరి ఐలయ్య, బిమోజ్ వెంకట్, క్యాష్ వెంకటేష్, మోసం వెంకటేశ్వర్లు, తాళ్లపెళ్లి హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !