-రాకేష్ కుటుంబానికి అండగా నిలిచిన నాగార్జున డెయిరీ…
హుజురాబాద్/ సెప్టెంబర్ 08 (మా అక్షరం): వంకాయగూడెం గ్రామానికి చెందిన మూల రాకేష్ ఇటీవల నాగార్జున డెయిరీకి చెందిన పాల వాహనం నడుపుతుండగా విద్యుత్ షాక్‌తో దుర్మరణం చెందాడు. ఈ నేపథ్యంలో రాకేష్ కుమార్తె మూల శాన్వి పేరు మీదుగా నాగార్జున డెయిరీ యాజమాన్యం రూ.1,50,000లను తాడికల పోస్టాఫీసులో ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా జమ చేశారు.ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలను మంగళవారం రాకేష్ భార్య లావణ్య, రాకేష్ తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ పుల్లూరి ప్రభాకర్‌రావు, కృషి చేసిన ఏజీఎం ఆకునూరి సుధాకర్, సిసిఎం మల్లారెడ్డి, సూపర్వైజర్ నరేష్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
Post Views: 62











