+91 99635 77856

హుజురాబాద్‌లో ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో పోస్టర్ ఆవిష్కరణ

హుజురాబాద్ /సెప్టెంబర్ 12 (మా అక్షరం): హుజురాబాద్ మండల ఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తలకోక్కుల హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఈనెల 19 నుంచి 21వ తేదీ వరకు నర్సింగ్‌లోని ఓం కన్వెన్షన్‌లో జరగబోయే ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో పోస్టర్ ఆవిష్కరణ శుక్రవారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఓడితేల ప్రణవ్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది.ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ …ప్రతి ఏడాది కొత్తగా విడుదల అవుతున్న కెమెరాలు, నూతన సాంకేతిక పరికరాలు, ఏఐ టూల్స్ వాడకంపై అవగాహన కల్పించే వేదికగానే ఫోటో ఎక్స్‌పో నిలుస్తుందని, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు ఇది మంచి అవకాశమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు మాచర్ల రాజు, జిల్లా ఉపాధ్యక్షులు భాష వేణి రాజేష్, జిల్లా జాయింట్ సెక్రటరీ బింగి మురళీమోహన్, అసోసియేషన్ ఉపాధ్యక్షులు యాకుబ్ అలీ, ఎడ్ల కుమార్, ప్రధాన కార్యదర్శి దూలం చిరంజీవి, సంయుక్త కార్యదర్శులు బండి రమేష్, కన్నూరి రాజేష్, కోశాధికారి తాటిపల్లి మధుకర్, గౌరవ అధ్యక్షులు అయిత రాజేందర్, ఫోటోగ్రాఫర్లు డి. వెంకటయ్య, వేముల శ్రీనివాస్, మాడ రవీందర్ రెడ్డి, బిక్షపతి, రమేష్, నరేందర్, సృజన్, బిక్షపతి శ్రీధర్, సంపత్, ఆదిత్య, శ్రీశైలం, పాషా తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !