– పట్టణాల అభివృద్ధికి నిధులిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం…
– హుజురాబాద్ పట్టణానికి 15కోట్లు,జమ్మికుంట పట్టణానికి 15కోట్లు మంజూరు…
– ఎమ్మెల్సీగా,విప్ గా ఉన్న సమయంలో హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఏం నిధులు తీసుకొచ్చావో చెప్పేంత ధైర్యం ఉందా?
హుజురాబాద్/ సెప్టెంబర్ 26 (మా అక్షరం): హుజురాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని,ఉప ఎన్నికల తర్వాత హుజురాబాద్ అభివృద్ధికి సంబంధించి రూపాయి నిధులు కూడా విడుదల కాలేదని,కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల్లో ఇన్చార్జిగా హుజురాబాద్,జమ్మికుంట పట్టణాల అభివృద్ధికి 30 కోట్లు,ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా 10 కోట్లు,హుజురాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి అదనంగా మరో కోటి ఎనిమిది లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను ఆయన రిలీజ్ చేశారు.నిధులు మంజూరు చేసినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్,దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ప్రత్యేకంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ… కౌశిక్ రెడ్డి సోషల్ మీడియాలో బోగస్ ప్రచారాలు చేస్తూ అబద్ధపు మాటలు మాట్లాడుతున్నాడని,ఉప ఎన్నిక తర్వాత ఎమ్మెల్సీగా అయిన నాటినుండి కౌశిక్ రెడ్డి ప్రభుత్వ విప్ గా కొనసాగుతూ హుజరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి రూపాయి నిధులు కూడా తీసుకురాలేదని,చిత్తశుద్ధి ఉంటే ఎన్ని నిధులు తీసుకొచ్చారు తెలుపాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక,ఇన్చార్జిగా తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత నియోజకవర్గ అభివృద్ధి గురించి పలుమార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని దానికి సానుకూలంగా స్పందించి వారు నిధులను మంజూరు చేశారని,విద్యా రంగానికి ప్రాధాన్యత ఇస్తూ హుజురాబాద్ కు ఐటీఐ (ఏటీసి) కాలేజీ కూడా మంజూరు చేశారని తెలిపారు.
ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో వీణవంక నుండి నరసింగాపూర్ వెళ్లాల్సిన ప్రధాన రహదారిని పూర్తి చేయలేని కౌశిక్ రెడ్డి 30 కోట్ల నిధులు తెచ్చారు అనడం హాస్యాస్పదమని,సొమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానిదైతే కేసీఆర్ ఇప్పించినట్టు బిల్డప్ కొట్టడం చూసి జనాలు నవ్వుకుంటున్నారని అన్నారు.రాబోయే రోజుల్లో హుజురాబాద్ కు మరిన్ని నిధులు తీసుకువచ్చి హుజరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామని అన్నారు.











