+91 99635 77856

దత్తయ్య పార్థివదేహానికి నివాళులర్పించిన మాజీ ఎంపీ కెప్టెన్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్

Kudikala Sai Editor
maaksharamnews.in

దత్తయ్య పార్థివదేహానికి నివాళులర్పించిన మాజీ ఎంపీ కెప్టెన్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్

హుజురాబాద్/ సెప్టెంబర్ 28(మా అక్షరం):
పట్టణానికి చెందిన వేద పండితులు, ప్రముఖ పురోహితులు అవధానుల దత్తాత్రేయ శర్మ (దత్తయ్య ) (95) ఆదివారం ఉదయం మృతి చెందారు. దత్తయ్య పార్థివ దేహాన్ని హుస్నాబాద్ మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి. లక్ష్మీ కాంతారావు దంపతులు, హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వి .సతీష్ కుమార్ సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. దత్తయ్య మృతి తీరనిలోటని అన్నారు. ఆయన జిల్లా రాష్ట్రవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారని సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించేందుకు కృషి చేశారని ప్రశంసించారు. ఆయన మృతికి సంతాపాన్ని కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.తమ కుటుంబానికి దత్తయ్యతో ఎంతో అనుబంధం ఉందని, తమకు అన్ని విషయాల్లో మార్గ నిర్దేశం చేసేవారని, పెద్దవారిగా ప్రోత్సహించేవారని, ఎంత దిగిన వొదిగి ఉండేవారని, ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరించేవారని గుర్తు చేసుకున్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !