+91 99635 77856

బంద్‌కు బీసీ వర్గాల సంపూర్ణ మద్దతు ఇవ్వాలి

Kudikala Sai Editor
maaksharamnews.in

బంద్‌కు బీసీ వర్గాల సంపూర్ణ మద్దతు ఇవ్వాలి

-ప్రభుత్వం చిత్తశుద్ధితో 42% రిజర్వేషన్ ఇవ్వాలి...
-బీసీ కుల జనగణన మండల కన్వీనర్ మార్త రవీందర్...
హుజురాబాద్/ అక్టోబరు 16 (మా అక్షరం):
ఈనెల 18వ తేదీన జరగబోయే రాష్ట్ర బంద్‌కు బీసీ వర్గాలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని బీసీ కుల జనగణన మండల కన్వీనర్ మార్త రవీందర్ గురువారం పిలుపునిచ్చారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై ప్రభుత్వం గానీ, ప్రతిపక్ష పార్టీలు గానీ చిత్తశుద్ధి చూపడం లేదని ఆయన విమర్శించారు. ప్రజా వర్గాల మధ్య నమ్మకం కోల్పోయేలా రాజకీయ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని అన్నారు.బీసీల జనాభా తెలంగాణాలో 56.5 శాతం ఉంది. అలాంటి పెద్ద వర్గానికి 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడంలో ప్రభుత్వం వెనుకడుగు వేస్తోంది. పైగా, తమ పార్టీ ప్రయోజనాల కోసమే కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఇది బీసీలకు న్యాయం కాదని ప్రజలు గుర్తించాలని అన్నారు.రేపు జరగబోయే బంద్‌లో బీసీ వర్గాలు, సబ్బండ వర్గాలు, ప్రజాసంఘాలు అందరూ ఐక్యంగా పాల్గొని, బీసీల హక్కుల కోసం ఒక్కటిగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

Share ePaper Clip

Preparing image...

-ప్రభుత్వం చిత్తశుద్ధితో 42% రిజర్వేషన్ ఇవ్వాలి…
-బీసీ కుల జనగణన మండల కన్వీనర్ మార్త రవీందర్…
హుజురాబాద్/ అక్టోబరు 16 (మా అక్షరం):
ఈనెల 18వ తేదీన జరగబోయే రాష్ట్ర బంద్‌కు బీసీ వర్గాలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని బీసీ కుల జనగణన మండల కన్వీనర్ మార్త రవీందర్ గురువారం పిలుపునిచ్చారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై ప్రభుత్వం గానీ, ప్రతిపక్ష పార్టీలు గానీ చిత్తశుద్ధి చూపడం లేదని ఆయన విమర్శించారు. ప్రజా వర్గాల మధ్య నమ్మకం కోల్పోయేలా రాజకీయ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని అన్నారు.బీసీల జనాభా తెలంగాణాలో 56.5 శాతం ఉంది. అలాంటి పెద్ద వర్గానికి 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడంలో ప్రభుత్వం వెనుకడుగు వేస్తోంది. పైగా, తమ పార్టీ ప్రయోజనాల కోసమే కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఇది బీసీలకు న్యాయం కాదని ప్రజలు గుర్తించాలని అన్నారు.రేపు జరగబోయే బంద్‌లో బీసీ వర్గాలు, సబ్బండ వర్గాలు, ప్రజాసంఘాలు అందరూ ఐక్యంగా పాల్గొని, బీసీల హక్కుల కోసం ఒక్కటిగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !