+91 99635 77856

సిపిఆర్‌పై అవగాహన సదస్సు

హుజురాబాద్/ అక్టోబర్ 16 (మా అక్షరం):మండలంలోని శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో గురువారం సిపిఆర్ (కార్డియో పల్మనరీ రీససిటేషన్) పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో 108 అంబులెన్స్ సిబ్బంది రాజేందర్ రెడ్డి, బుచ్చిరెడ్డి ,అశోక్ రెడ్డి సమన్వయంతో నిర్వహించారు.మానవుల ప్రాణరక్షణలో అపర సంజీవనిగా పేరుపొందిన సిపిఆర్ విధానంపై విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వివరించారు. అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం వంటి అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ ఎంత ముఖ్యమో 108 సిబ్బంది ప్రదర్శనాత్మకంగా చూపించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ …సిపిఆర్ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన ప్రాణరక్షణ విద్య. సమయానికి సిపిఆర్ అందించడం ద్వారా అనేక ప్రాణాలు కాపాడవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !