+91 99635 77856

వంగర ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించాం

– బాలిక మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ప్రణవ్…
– బాలిక మృతదేహాన్ని అడ్డుపెట్టుకొని శవ రాజకీయాలు చేయడం సిగ్గుచేటు..
– ఓటు చోరీపై ఎలక్షన్ కమిషన్ కౌశిక్ రెడ్డి చంప చెళ్లుమనిపించింది…
– కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడిన ప్రణవ్…

హుజురాబాద్/అక్టోబర్ 25 (మా అక్షరం): భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో హుజురాబాద్ మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన శ్రీ వర్షిత అనే బాలిక శుక్రవారం ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని,దీనిపై ఇప్పటికే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణకు ఆదేశించారని, నివేదిక రాగానే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి సంతాపం తెలియజేశారు.బాలిక మృతదేహాన్ని అడ్డుపెట్టుకొని కౌశిక్ రెడ్డి చేసిన ధర్నా చూస్తే సభ్య సమాజం తలదించుకునేలా ఉందని,పాప చనిపోయి పుట్టెడు దుఃఖంలో తల్లిదండ్రులు ఉంటే దీన్ని కౌశిక్ రెడ్డి అదునుగాతీసుకొని పోస్ట్ మార్టం అయిన తర్వాత బాలిక మృతదేహాన్ని అంబేద్కర్ చౌరస్తాలో పెట్టి ధర్నా చేయడం నీచమైన రాజకీయమని,అప్పుడు ఓట్ల కోసం సెంటిమెంట్ వాడుకున్నాడని,ఇప్పుడు శవరాజకీయాలను కౌశిక్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడని ఇది సిగ్గు చేటని అన్నారు.కౌశిక్ రెడ్డి లాంటి దౌర్భాగ్యపు ఎమ్మెల్యే ను దేశంలో ఇంతవరకు ఎక్కడ చూడలేదని అన్నారు.కౌశిక్ రెడ్డికి అంతలా సహాయం చేయాలి అనుకుంటే నేరుగా అధికారులతో మాట్లాడి సహాయం చేయాలి కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం మంచిదికాదని అన్నారు.

ఓటు చోరీపై అసత్యపు ప్రచారాలు మానుకో కౌశిక్ రెడ్డి…ప్రణవ్…

ఓటు చోరీ జరిగిందని ఆరోపించిన కౌశిక్ రెడ్డికి ఎన్నికల సంఘం గట్టిగా బుద్ధి చెప్పిందని,చెంప చెల్లుమనేలా సమాధానం ఇచ్చిందని ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి బుద్ధి మార్చుకోవాలని కోరారు.ఎన్నికల సంఘం గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఓట్లు ఆ అపార్ట్మెంట్ లో ఉన్నాయని సమాధానం ఇవ్వగా బిఆర్ఎస్ నాయకులు తెల్లమొహం వేశారని అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !