+91 99635 77856

అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

Kudikala Sai Editor
maaksharamnews.in

అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

-అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి...
- ఎకరాకి రూ 40వేల నష్టపరిహారం చెల్లించాలి...
-హుజురాబాద్ పిఎసిఎస్ చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి...

హుజురాబాద్ /అక్టోబర్ 29 (మా అక్షరం): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాల వల్ల కోతకు వచ్చిన వరి, పత్తి తదితర పంటలకు ఎంతో నష్టం వాటిల్లుతుందని, ఎకరాకు 40 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హుజురాబాద్ సింగిల్విండో చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా అకాల వర్షాలతో కోతకు వచ్చిన వరి పంటలు గింజలు నేలరాలి రైతులు తీవ్ర ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుందన్నారు. కొంతమంది రైతులు కోసిన ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లి కుప్పలు పోయేగా సకాలంలో కొనుగోలు జరగకపోవడంతో వర్షానికి తడిసి ధాన్యం ముద్ద అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని బే షరతుగా కొనుగోలు చేయాలన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి రైతులను ఆదుకునేందుకు తక్షణమే తగిన చర్యలు చేపట్టాలన్నారు. రైతులకు ఉచితంగా టార్పలిను కవర్లు ఇచ్చి కోసి ఆరబెట్టిన ధాన్యం తడవకుండా రక్షించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను, ప్రజలను అన్ని విధాలుగా ఆదుకోవాలని కొండారెడ్డి విజ్ఞప్తి చేశారు.

Share ePaper Clip

Preparing image...

-అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి…
– ఎకరాకి రూ 40వేల నష్టపరిహారం చెల్లించాలి…
-హుజురాబాద్ పిఎసిఎస్ చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి…

హుజురాబాద్ /అక్టోబర్ 29 (మా అక్షరం): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాల వల్ల కోతకు వచ్చిన వరి, పత్తి తదితర పంటలకు ఎంతో నష్టం వాటిల్లుతుందని, ఎకరాకు 40 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హుజురాబాద్ సింగిల్విండో చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా అకాల వర్షాలతో కోతకు వచ్చిన వరి పంటలు గింజలు నేలరాలి రైతులు తీవ్ర ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుందన్నారు. కొంతమంది రైతులు కోసిన ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లి కుప్పలు పోయేగా సకాలంలో కొనుగోలు జరగకపోవడంతో వర్షానికి తడిసి ధాన్యం ముద్ద అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని బే షరతుగా కొనుగోలు చేయాలన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి రైతులను ఆదుకునేందుకు తక్షణమే తగిన చర్యలు చేపట్టాలన్నారు. రైతులకు ఉచితంగా టార్పలిను కవర్లు ఇచ్చి కోసి ఆరబెట్టిన ధాన్యం తడవకుండా రక్షించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను, ప్రజలను అన్ని విధాలుగా ఆదుకోవాలని కొండారెడ్డి విజ్ఞప్తి చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !