-సమస్య చెబితే కేసులు పెడతారా…
-మున్సిపల్ కమిషనర్ పై బెడ బుడగ జంగం జనసంగం ఆరోపణలు…
-కమిషనర్ పై చర్యలు తీసుకోవాలి…
– బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిరిపాటి వేణు…
హుజురాబాద్/ నవంబర్ 16(మా అక్షరం):
పట్టణంలోని బుడగ జంగాల కాలనీ లోని సమస్యలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కు విన్నవించుకునేందుకు వెళ్తే తమపై కేసులు పెడతానని బెదిరిస్తున్నాడని బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిరిపాటి వేణు ఆరోపించారు.
ఆదివారం హుజురాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా బుడిగ జంగం కాలనీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుందని, ముఖ్యంగా వర్షాకాలం వస్తే చాలు కాలనీ మొత్తం నీళ్లలోనే ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారిన బుడగ జంగాల కాలనీవాసుల సమస్యలు మాత్రం అలానే ఉంటున్నాయని అన్నారు.ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ప్రజాప్రతినిధులతో మా గోడు వెల్లవించుకున్న వారు పట్టించుకోవడంలేదని అన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఓడితేల ప్రణవ్ వచ్చిన సమయంలో సమస్య చెబితే మున్సిపల్ కమిషనర్ కు ఖర్చు అంచనా వేయమని చెబితే ఇప్పటివరకు అంచనా వేయలేదని, పనుల అంచనా కోసం కమిషనర్ దగ్గరికి వెళ్లి కలిస్తే ఇక్కడ ఏం కాదు కరీంనగర్ కు వెళ్లి సమస్య పరిష్కరించుకోవాలని చెబితే కరీంనగర్ కు కలెక్టర్ కలిస్తే తిరిగి మున్సిపల్ కమిషనర్ కి రాసిందన్నారు. మున్సిపల్ కమిషనర్ వద్దకు వచ్చి అడిగితే మొదట ఆఫీసు నుంచి బయటకు వెళ్ళమని మరోసారి వస్తే కేసులు పెడతానని బెదిరించారని వారు ఆరోపించారు. కమిషనర్ తీరు మారకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో బేడ బుడగ జంగం జన సంఘం నాయకులు పాల్గొన్నారు.











