+91 99635 77856

ఇందిరమ్మ ఇళ్ల నూతన గృహ ప్రవేశానికి హాజరైన ప్రణవ్..

Kudikala Sai Editor
maaksharamnews.in

ఇందిరమ్మ ఇళ్ల నూతన గృహ ప్రవేశానికి హాజరైన ప్రణవ్..

హుజూరాబాద్/నవంబర్16 (మా అక్షరం): పట్టణంలోని 1వ వార్డు కొత్తపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో ఆదివారం ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పేదవారి కలల్ని నిజం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్‌దే అని పేర్కొన్నారు.సొంతింటి కల ప్రతి పేద కుటుంబ జీవిత లక్ష్యమని, ఆ లక్ష్యాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గం, కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్ల ద్వారా నెరవేర్చుతోందన్నారు. అర్హులైన ప్రతీ పేదవారికి విడతల వారీగా ఇళ్లు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఇంటి కోసం ఇన్నాళ్లుగా ఎదురుచూసిన పేదవారి సంతోషం తీరని ఆనందమని పేర్కొన్నారు.“కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదోళ్ల ప్రభుత్వం. పేదవారి పక్షాన నిలబడేందుకు, వారి ఆశలు నెరవేర్చేందుకు మేము ఉన్నాం” అని ప్రణవ్‌ అన్నారు. రాబోయే రోజుల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలోని అర్హులైన పేద కుటుంబాలకు మరిన్ని ఇళ్లు అందజేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !