+91 99635 77856

కందుగుల పాఠశాలకు జయన్న ఫౌండేషన్ చేయూత

-కందుగుల పాఠశాలకు జయన్న ఫౌండేషన్ చేయూత…
-మోటార్, పైప్‌లైన్ ఏర్పాటు, బాలికలకు శానిటరీ నాప్కిన్స్ పంపిణీ…

హుజురాబాద్/నవంబర్ 22 (మా అక్షరం):మండలంలోని కందుగుల గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాల కు మౌలిక సదుపాయాలు అందించి ఉదారత చాటుకున్నారు. మంచినీటి సరఫరా కోసం మోటారు, పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. విద్యార్థుల వినియోగానికి ప్లేట్లు, గ్లాసులు, బాలికలకు సానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జయన్న ఫౌండేషన్ చైర్మన్ గుడిపాటి సరిత- జైపాల్ రెడ్డి మాట్లాడుతూ…విద్య, ఆరోగ్యం అభివృద్ధికి తమ స్థాయిలో సహకారం అందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కాసం రఘుపతి రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ బెల్లి రాజయ్య, కాంగ్రెస్ ఎస్సి రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !