-కాంగ్రెస్ బిజెపిలకు బీసీలపై సిద్ధ శుద్ధి లేదా ?..
-మాటమీద నిలబడాల్సిందే లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం, రాష్ట్రాన్ని స్తంభింప చేస్తాం…
-42 శాతం రిజర్వేషన్లు అమలు చేయండి లేదంటే మీ కుర్చీలు ఖాళీ చేయండి…
– బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్…
హుజురాబాద్/ నవంబర్ 21(మా అక్షరం): ఎన్నికల సమయంలో బీసీల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ బీసీ జపం చేసి కామారెడ్డిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి బీసీ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలను ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాల్సిందేనని బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు పెంచుతామని ఇచ్చిన మాటను పక్కనపెట్టి నేడు ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బొంద పెడతామని, రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే బీసీల కు ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేని పక్షంలో కుర్చీ ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. బీసీలను మోసం చేసి ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేసిన సందర్భంలో గత సంవత్సరం ఆగస్టు 25వ తారీకు నుంచి 12 రోజులపాటు ఆమరణ నిరాహారదీక్ష చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించిన సందర్భంలో మాత్రమే కుల గణన చేపట్టారని అట్టి కుల గణన తప్పులతడకగా చేశారని ప్రత్యేక స్వయంప్రతిపత్తి గల సంస్థతో చేయాల్సిన కుల గణన రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని ప్రణాళిక శాఖ ద్వారా చేయడం, డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని అనేక డిమాండ్లు చేసినప్పటికీ నిర్లక్ష్యం చేసి కులగల ప్రారంభమైన తర్వాత ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ చేత తప్పుడు రాతలు రాయించిన ఘనత ఈ రేవంత్ రెడ్డి కే దక్కుతుందని ఓటు కేసులలో నిలబడిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగానే ఈ ప్రణాళిక మొత్తం చేసిందని బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి పంతం పడతామని హెచ్చరించారు. ఈ దేశాన్ని వెళ్తున్న బిజెపి ఆనాటికి ఈనాటికి బీసీలపై కక్షపూరిత వైఖరితోనే వ్యవహరిస్తుందని పేరుకు మాత్రమే బీసీ ప్రధానిగా చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ బీసీల విషయంలో కూసమెత్తు పని కూడా చేయలేకపోయినా అసమర్థులని విమర్శించారు. కాంగ్రెస్ బిజెపిలకు నిజంగా బీసీలపై ప్రేమ చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా బీసీల రిజర్వేషన్లను పెంచి జనాభా ప్రాతిపదికన బీసీలకు విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాలలో అవకాశాలు అందించాలని డిమాండ్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని లేనిపక్షంలో రాష్ట్రాన్ని స్తంభింప చేస్తామని హెచ్చరించారు, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుడికాల భాస్కర్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చిలుకమారి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి సంపత్ ముదిరాజ్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఇపకాయల సాగర్, బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర కార్యదర్శి బుర్ర కుమార్ గౌడ్, బిసి సంఘం నాయకులు పెరుమాండ్ల సదానందం, నాగరాజు, రాజు, మహేందర్, జూపక శివమణి, కందుకూరి భాస్కర్,స్థానిక నాయకులు సొల్లు బాబు,తునికి సమ్మయ్య, నాయి బ్రాహ్మణ సంఘం నడిగొట్టి రమేష్,ముదిరాజు సంఘం నాయకులు ఆళ్ల కేశవులు, తదితరులు పాల్గొన్నారు.











