-ఈడబ్ల్యూఎస్ కోటాలో అగ్రవర్ణ పేదలకు న్యాయం చేయాలి…
– రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి…
– ఓసి జేఏసీ నాయకులు ఎడవెల్లి కొండారెడ్డి…
న్యూఢిల్లీ/ హుజురాబాద్ /ఫిబ్రవరి 23 (మా అక్షరం):అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ కోటాలో రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేయాలని ఓసి జేఏసీ నాయకులు ఎడవల్లి కొండల్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓసి లోని పేదల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఓసి జెఎసి ఆధ్వర్యంలో మహాధర్న నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన కొండల్ రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ 10శాతం ఈడబ్ల్యూఎస్ పై రాజకీయ పబ్బం కోసం కొన్ని దుష్ట శక్తులు ఆయా కులాల్లోని ప్రజలను మభ్య పెడుతూ చేస్తున్న అసత్య ప్రచారాలు, పన్నుతున్న కుట్రలను సాగనివ్వబోమని హెచ్చరించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు ఓసి ల స్థితి గతుల అధ్యయనానికి జాతీయ స్థాయిలో చట్టబద్ధత తో కూడిన ఓసి ల కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈడబ్లూస్ సర్టిఫికెట్ జారీకి వార్షిక ఆదాయ పరిమితిని 10 లక్షలకు పెంచాలని, ఈడబ్ల్యూఎస్ కోటాకు కేటాయించిన మిగిలిపోయిన బ్యాక్ లాగ్ పోస్టులను ఈడబ్ల్యూఎస్ వారితోనే భర్తీ చేయాలని డిమాండ్ ఆయన చేశారు. ఓసి లకు నేటికీ రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడం వల్ల జనరల్ స్థానాల్లో కనీసం 15 శాతం సీట్లు కూడా గెలుచుకోలేక తీవ్రంగా నష్టోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న 50 శాతం మించకుండా ఉన్న రిజర్వేషన్లలో ఓసి లకు కూడా రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
రైతులకు గిట్టుబాటు ధర కనిపించాలి..
రైతులకు ప్రస్తుత గిట్టుబాటుధర ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని, రైతు తాను పండించిన పంటకు రైతులే గిట్టు బాటు ధర నిర్ణయించే భాగస్వామ్యం కల్పించే ప్రత్యేక చట్టం తీసుకు రావాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈరోజు ధర్నా నిర్వహించినట్లు పేర్కొన్నారు.











