+91 99635 77856

హుజురాబాద్‌లో విషాదం

Kudikala Sai Editor
maaksharamnews.in

హుజురాబాద్‌లో విషాదం

-హుజురాబాద్‌లో విషాదం...
-అప్పుల భారంతో గృహిణి ఆత్మహత్య...
హుజురాబాద్/ ఫిబ్రవరి 23(మా అక్షరం): హుజురాబాద్ పట్టణంలోని విద్యానగర్ ప్రాంతంలో అప్పుల భారంతో ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. సోమవారం టౌన్ సిఐ కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం… విద్యానగర్‌కు చెందిన వేముల కరుణాకర్ (57) జే-10 ఏజెన్సీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.ఆయన భార్య వేముల భాగ్యలక్ష్మి (56) గృహిణి.కుటుంబానికి సొంత ఇల్లు లేదా భూమి లేకపోవడంతో జీవనోపాధి నిమిత్తం సుమారు రూ.10 లక్షల వరకు పిరమల్ ఫైనాన్స్ సంస్థలో రుణం తీసుకుని ప్రతి నెలా ఈఎంఐలు చెల్లిస్తూ వస్తున్నారు.
ఇటీవల కరుణాకర్‌కు పని సరిగా దొరకకపోవడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.అప్పుల భారంతో తీవ్ర మనస్తాపానికి గురైన భాగ్యలక్ష్మి ఈ నెల 22వ తేదీ సాయంత్రం ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.మృతురాలి భర్త వేముల కరుణాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Share ePaper Clip

Preparing image...

-హుజురాబాద్‌లో విషాదం…
-అప్పుల భారంతో గృహిణి ఆత్మహత్య…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !