-హుజురాబాద్‌లో ఘనంగా ఇఫ్తార్ విందు
మతసామరస్యానికి ప్రతీకగా రంజాన్ వేడుకలు…
హుజురాబాద్/ మార్చి 18 (మా అక్షరం): పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పట్టణంలో బుధవారం ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రోంటాల సుహాసిని పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రంజాన్ మాసం కేవలం పండుగ మాత్రమే కాకుండా విలువలను గుర్తుచేసే పవిత్ర కాలమని అన్నారు. నెలరోజుల పాటు ఆత్మశుద్ధితో జీవిస్తూ, పరులకు సహాయం చేయడం ద్వారా సత్సంబంధాలను పెంపొందించుకోవడం ఈ మాసం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, స్వయం ఉపాధికి ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు.రాష్ట్ర అభివృద్ధికి అన్ని మతాల ప్రజలు కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆమె కోరారు. మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం సాధ్యమైనంత మేర సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జామే మస్జిద్ ఈద్గా & ఖబ్రస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, మస్జిద్-ఎ-బషీర్ అధ్యక్షుడు షేక్ ఫయాజ్, మున్సిపల్ కౌన్సిలర్లు, ముస్లిం మతపెద్దలు ముఫ్తీ అమీర్ బాబా, హఫీజ్ ఇమ్రాన్ బేగ్ తదితరులు, మైనారిటీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










