+91 99635 77856

రైతుబంధు ప్రధమ లబ్ధిదారుడు మూగల సంజీవరెడ్డి మృతి

Kudikala Sai Editor
maaksharamnews.in

రైతుబంధు ప్రధమ లబ్ధిదారుడు మూగల సంజీవరెడ్డి మృతి

-రైతుబంధు ప్రధమ లబ్ధిదారుడు మూగల సంజీవరెడ్డి మృతి...
హుజురాబాద్ /మార్చి 18( మా అక్షరం): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి ఉద్భవించిన ప్రతిష్టాత్మక రైతు బంధు పథకం ద్వారా లబ్ధి పొందిన హుజరాబాద్ నియోజకవర్గం ధర్మరాజులపల్లి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు మూగల సంజీవరెడ్డి అనారోగ్యంతో తన స్వగృహంలో బుధవారం సాయంత్రం మృతి చెందారు. ధర్మరాజులపల్లి గ్రామంలో రైతులను చైతన్యవంతం చేయడంలో సక్సెస్ అయి రైతుల్లో సహకార పూర్తి నింపిన మూగల సంజీవరెడ్డి రైతు బంధు పథకం ప్రధమంగా హుజురాబాద్ మండలం చెల్పూరు గ్రామపంచాయతీ పరిధిలో 2018లో అట్టహాసంగా వేలాది మంది రైతుల సమక్షంలో అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా మొదటగా రైతు బందు చెక్కును అందుకొని వార్తల్లో కెక్కారు. మొగల సంజీవరెడ్డి తన స్వగ్రామంలో రైతులను సంఘటితపరిచి సహకార రంగంలో ధాన్య ఉత్పత్తి సహకార సంస్థలు నెలకొల్పడంలో ప్రత్యేక చొరవ చూపారు. ప్రస్తుతం ఆ గ్రామంలో రైతులు సహకార సంఘంగా ఏర్పడి విత్తన ఉత్పత్తి సంస్థను విస్తరించడంలో కృషి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మూగల సంజీవరెడ్డి 1981 ముందు మేజర్ గ్రామపంచాయతీ ఉప్పల్ వార్డు మెంబర్గా, ఆ తర్వాత ఉప్పల్ గ్రామపంచాయతీ నుండి విడిపోయి ప్రత్యేక గ్రామ పంచాయతీగా ధర్మరాజుల పల్లె ఏర్పడినప్పుడు మువ్వల సంజీవరెడ్డి ప్రధమ సర్పంచ్ గా ఏకగ్రీవంగా నియమింపబడ్డారు, హుజురాబాద్ నియోజకవర్గంలో ఆదర్శవంతమైన గ్రామంగా నిలవడంలో మూగల సంజీవరెడ్డిది క్రియాశీలమైన పాత్ర అని చెప్పవచ్చు. అదేవిదంగా ధర్మరాజులపల్లె లో సహకార విత్తనఉత్పత్తి సంస్థ వ్యవస్థాపకులు గా ఉండి రైతులను ఏకతాటిపైకి తీసుకువచ్చారు. 95 ఏళ్ల మూగల సంజీవరెడ్డి మృతి పట్ల మాజీ మంత్రి పెద్దిరెడ్డి, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీ కాంతారావు, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి లతో పాటు, రెడ్డి సంఘం రాష్ట్ర నేత పోరెడ్డి శంతన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గూడూరు స్వామి రెడ్డి, టిఆర్ఎస్ నేత ఎడవెల్లి కొండారెడ్డి, మాజీ ఎంపిటిసి దండ విక్రం రెడ్డి తదితరులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు.

Share ePaper Clip

Preparing image...

-రైతుబంధు ప్రధమ లబ్ధిదారుడు మూగల సంజీవరెడ్డి మృతి…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !