+91 99635 77856

బుడిగజంగాల కాలనీ “అంజన్న”కు కొత్త శోభ

Kudikala Sai Editor
maaksharamnews.in

బుడిగజంగాల కాలనీ “అంజన్న”కు కొత్త శోభ

-బుడిగజంగాల కాలనీ "అంజన్న"కు కొత్త శోభ...

-ఆంజనేయ స్వామికి.. తొడుగు బహుకరణ...

-తొడుగు బహుకరించిన ఎజ్జు స్వప్న వేణు దంపతులు...

హుజురాబాద్ మార్చి 24( మా అక్షరం)పట్టణంలోని 22, 23 వ వార్డుల పరిధిలోని బుడుగ జంగం కాలనీలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి లక్ష రూపాయల విలువైన ఇత్తడి తొడుగును ఎజ్జు స్వప్న వేణు దంపతులు మంగళవారం అందజేశారు. పట్టణంలోని ప్రధాన ఆంజనేయస్వామి ఆలయం, పాటి మీద అంజన్న ఆలయం తర్వాత 22వ వార్డులోని ఈ ఆలయమే ప్రధాన ఆకర్షణగా ఉంది. భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శిస్తారు. మంగళ, శనివారాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. నిత్య ధూప దీప నైవేద్యాలతో దేవాలయాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. సుమారు 16 సంవత్సరాల క్రితం భక్తులు ఆంజనేయస్వామిని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. ఆయా పండుగలు పర్వదినాల్లో, శ్రావణ కార్తీక, ధనుర్ మాసాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. అలాగే ప్రతి ఏడాది శ్రీరామనవమికి కళ్యాణం ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనికి పెద్ద సంఖ్యలో భక్తజనం హాజరవుతున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి తొడుగును బహుకరించిన స్వప్న వేణు దంపతులను భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, మాజీ కౌన్సిలర్పోరెడ్డి రజిత శంతన్ రెడ్డి పృద్విరాజ్, ఆనంద్ సతీష్ ఎజ్జు రాజు అభిరామ్ సాంబరాజు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-బుడిగజంగాల కాలనీ “అంజన్న”కు కొత్త శోభ…

-ఆంజనేయ స్వామికి.. తొడుగు బహుకరణ…

-తొడుగు బహుకరించిన ఎజ్జు స్వప్న వేణు దంపతులు…

హుజురాబాద్ మార్చి 24( మా అక్షరం)పట్టణంలోని 22, 23 వ వార్డుల పరిధిలోని బుడుగ జంగం కాలనీలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి లక్ష రూపాయల విలువైన ఇత్తడి తొడుగును ఎజ్జు స్వప్న వేణు దంపతులు మంగళవారం అందజేశారు. పట్టణంలోని ప్రధాన ఆంజనేయస్వామి ఆలయం, పాటి మీద అంజన్న ఆలయం తర్వాత 22వ వార్డులోని ఈ ఆలయమే ప్రధాన ఆకర్షణగా ఉంది. భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శిస్తారు. మంగళ, శనివారాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. నిత్య ధూప దీప నైవేద్యాలతో దేవాలయాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. సుమారు 16 సంవత్సరాల క్రితం భక్తులు ఆంజనేయస్వామిని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. ఆయా పండుగలు పర్వదినాల్లో, శ్రావణ కార్తీక, ధనుర్ మాసాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. అలాగే ప్రతి ఏడాది శ్రీరామనవమికి కళ్యాణం ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనికి పెద్ద సంఖ్యలో భక్తజనం హాజరవుతున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి తొడుగును బహుకరించిన స్వప్న వేణు దంపతులను భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, మాజీ కౌన్సిలర్పోరెడ్డి రజిత శంతన్ రెడ్డి పృద్విరాజ్, ఆనంద్ సతీష్ ఎజ్జు రాజు అభిరామ్ సాంబరాజు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !