– డంపింగ్ యార్డ్ సమస్యపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం…
– ఇప్పటికే మంత్రులకు ఉన్నత అధికారుల దృష్టికి ఈ సమస్యపై వివరణ…
– త్వరలో సీఎంను కలుస్తా,శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తా…
– కాంగ్రెస్ హుజరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి వొడితల ప్రణవ్…
హుజురాబాద్/ మార్చి 26 (మా అక్షరం): ప్రజా వ్యతిరేక పనులను కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏరోజు చేయబోదని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.గత మూడు రోజులుగా డంపింగ్ యార్డ్ రద్దు కోసం అఖిల పక్షం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన దీక్షలకు సంఘీభావం తెలుపుతూ గురువారం రోజున హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు.కాసేపు వారితో కలిసి దీక్షస్థలిపై కూర్చున్నారు.ఈ సమస్యకు ప్రణవ్ వారధిగా ఉండి పరిష్కారం చూపెట్టాలని అఖిలపక్ష నాయకులు కోరారు.అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ… ఇప్పటికే ప్రభుత్వ పెద్దలకు ఈ సమస్యపై వివరించామని ప్రజలకు హాని చేసే ఏ పనిని అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒప్పుకోదని,డంపింగ్ యార్డు వలన ప్రజలకు తలెత్తే సమస్యలను అధికారులకు వివరించామని,వివిధ కార్పొరేషన్,మున్సిపల్ నుండి వచ్చే చెత్త వలన చెడు పరిమాణాలు ఎదురవుతాయని అన్నారు.హుజూరాబాద్ డంపింగ్ యార్డు వద్దని జనాలు నివాసం లేని చోట నిర్మించుకోవాలని సూచించమని అన్నారు.ఈ ప్రతిపాదన 2022 లోనే చేశారని అప్పుడే అప్పటి నాయకులు అడ్డుకుంటే ఈ పరిస్థితి ఉండబోయేదని అన్నారు.ఈ సమస్య పార్టీలకు అతీతంగా సామరస్యంగా హుజూరాబాద్ భవిష్యత్ కోసం కృషి చేయాలని,దీనికోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ కలుస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని,కౌన్సిలర్లు,వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు,ప్రజా సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.












