+91 99635 77856

డంపింగ్ యార్డు రద్దు పై మంత్రి పొన్నంకు వినతి

Kudikala Sai Editor
maaksharamnews.in

డంపింగ్ యార్డు రద్దు పై మంత్రి పొన్నంకు వినతి

హుజూరాబాద్/ మార్చి 27 (మా అక్షరం): పట్టణ సమీపంలో ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డు నిర్మాణాన్ని రద్దు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.శుక్రవారం స్థానిక ఎస్సారెస్పీ కాలువ వద్ద మంత్రిని కలిసి వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల మున్సిపాలిటీల చెత్తను హుజూరాబాద్‌కు తరలించడం వల్ల విషపూరిత రసాయనాలు వెలువడి ప్రజలు, జంతువులకు ప్రమాదం కలగవచ్చని పేర్కొన్నారు.ఈ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి టెండర్ ప్రక్రియను రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.మంత్రిని కలిసిన వారిలో మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని, అఖిలపక్ష నాయకులు పల్కల ఈశ్వర్ రెడ్డి, వేల్పుల రత్నం, ప్రభాకర్, బండ శ్రీనివాస్, కటుకూరి మల్లారెడ్డి, నర్సింహారెడ్డి, వర్ధినేని రవీందర్ రావు, కొండల్ రెడ్డి, జనార్ధన్, సమ్మయ్య, బాబు తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !