+91 99635 77856

డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా నిరాహార దీక్ష రేపటి నుంచి అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిరాహార దీక్ష

Kudikala Sai Editor
maaksharamnews.in

డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా నిరాహార దీక్ష రేపటి నుంచి అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిరాహార దీక్ష

హుజురాబాద్/ ఏప్రిల్ 06( మా అక్షరం): పట్టణంలో ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.రేపు (ఏప్రిల్ 7) ఉదయం 10 గంటల నుంచి ఏప్రిల్ 8 ఉదయం 10 గంటల వరకు అంబేద్కర్ చౌరస్తాలో ఈ దీక్ష కొనసాగనుంది. హుజురాబాద్ నియోజకవర్గంలోని 108 గ్రామ పంచాయతీల ప్రజలు, పార్టీలకు అతీతంగా మహిళలు, యువకులు, రైతులు, వృద్ధులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ నిరసనకు మద్దతు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు.డంపింగ్ యార్డ్ ఏర్పాటు జరిగితే ప్రజల ఆరోగ్యం, పర్యావరణం, వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింటాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సమస్యను ప్రజలు గంభీరంగా తీసుకుని ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని కోరారు.హుజురాబాద్ భవిష్యత్తును కాపాడుకోవాలంటే ప్రజలంతా ఒక్కటిగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !