+91 99635 77856

దామోదర్ రెడ్డి కాంస్య విగ్రహావిష్కరణకు హాజరైన వొడితల ప్రణవ్

– దామోదర్ రెడ్డి సేవలు చిరస్మరణీయం…

– హుజూరాబాద్ నియోజకవర్గంలో దామోదర్ రెడ్డి విగ్రహన్ని ఏర్పాటు చేస్తాం….

హుజరాబాద్/ ఏప్రిల్ 09 (మా అక్షరం): రాజకీయాల్లో ప్రజల అవసరాల కోసం పనిచేసి కరీంనగర్ జిల్లా టైగర్ గా,నమ్మకానికి,విశ్వసనీయతకు మారు పేరు తెచ్చుకున్న మహా నాయకుడు ముద్దసాని దామోదర్ రెడ్డి అని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.గురువారం కరీంనగర్ పట్టణ శివారులోని సదాశివపల్లిలో పెద్దపల్లి ఎమ్మేల్యే,ప్రభుత్వ విప్ విజయ రమణారావు ఆధ్వర్యంలో ఆయన 14వ వర్ధంతి సందర్భంగా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ ముద్దసాని దామోదర్ రెడ్డి గురించి జిల్లాలో తెలియని వ్యక్తి లేడంటే అతిశయోక్తి కాదని,వ్యక్తిగతంగా మా కుటుంబానికి,మా తాత వొడితల రాజేశ్వర్ రావు కు చాలా దగ్గరి వ్యక్తి అని,వారి నుండి మాలాంటి యువతర నాయకులం నేర్చుకోవాల్సింది చాలా ఉందని,వారి ఆశయాలకు అణుగుణంగా ప్రజా జీవితంలో పనిచేస్తామని,హుజూరాబాద్ నియోజకవర్గంలో దామోదర్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తానని ప్రణవ్ తెలిపారు.విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సభలో పెద్దపల్లి శాసన సభ్యుడు విజయ రమణారావు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలో దామోదర్ రెడ్డికి అభిమానులు ఉండేవారని,వారి తర్వాత ఆ ప్రాంతానికి నాయకత్వం వహించే నాయకుడిగా వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ,కరీంనగర్ శాసన సభ్యులు గంగుల కమలాకర్,కరీంనగర్ మేయర్ శ్రీనివాస్,సుడా చైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి,గ్రంథాలయ సంస్థ చైర్మెన్ సత్తు మల్లేష్,దామోదర్ రెడ్డి అభిమానులు భారీగా పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !