రైతులు పండించిన ప్రతి గింజను కొంటాం: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి
-అర్గుల్ లో మొక్కజొన్న,వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం…
-రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు…
-ప్రభుత్వానికి కష్టమైన సరే ప్రతి గింజను కొంటాం…
-అన్నం బెట్టే రైతును ఆదరించేది మా కాంగ్రెస్ ప్రభుత్వం…
-రైతును రాజు చేయడమే తమ ప్రభుత్వం లక్ష్యం…
-ప్రతిపక్షాల చిల్లర మాటలకు మోసపోవద్దు…
నిజామాబాద్/ ఏప్రిల్ 09 (మా అక్షరం)
రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నిజమాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పేర్కొన్నారు. గురువారం జక్రాన్ పల్లి మండలం అర్గుల్ లో తెలంగాణ మార్క్ ఫెడ్ ద్వారా పి.ఏ.సీ.ఏస్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు అదేవిధంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంబించారు. ఈ సందర్భంగా తూకం వద్ద ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం పంటను తూకం వేసి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కాగా మొక్కజొన్న క్వింటాల్ రూ.2400, వరి గ్రేడ్–ఏ క్వింటాల్ రూ.2389,గ్రేడ్ –బి రూ.2369లకు కొనుగోలు చేస్తుంది.అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డా.భూపతి రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తుందన్నారు. ప్రభుత్వానికి నష్టం వాటిల్లినా సరే ఏ ఒక్క రైతు నష్టపోకుండా మద్దతు ధరతో పంట కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు.అత్యధికంగా మన నిజామాబాద్ జిల్లాలోనే వరి పంట సాగు అవుతుందని గుర్తు చేశారు. నియోజకవర్గంలో దాదాపు 218 కొనుగోలు కేంద్రాల్లో పంటను కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిన్నా రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, పొలసాని శ్రీనివాస్,పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్,పార్టీ నాయకులు మునిపల్లి పెద్ద సాయి రెడ్డి,సర్పంచ్ ఫోరం జిల్లా అధ్యక్షులు మునిపల్లి సాయి రెడ్డి,ఉమ్మాజి నరేష్,హన్మండ్లు,రాంచందర్ గౌడ్,శ్యాం సన్,అంబర్ సింగ్ స్థానిక సర్పంచ్ సాయన్న,మాజీ సర్పంచ్ రాజన్న,గంగారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.













