హుజరాబాద్/ ఏప్రిల్ 09 (మా అక్షరం) హుజురాబాద్‌లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్‌ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ గురువారం జిల్లా కలెక్టర్ ని కలిసి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ…. హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల కేవలం హుజురాబాద్ మండలం,పట్టణ ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఉన్న సైదాపూర్, కేశాపట్నం, మానకొండూర్ భీమదేవరపల్లి మండలాల ప్రజలు మరియు రైతులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. డంపింగ్ యార్డ్ కారణంగా గాలి, నీరు, భూమి కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని, ముఖ్యంగా రైతుల వ్యవసాయ భూములు, పంటలు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రజల ఆరోగ్యం, రైతుల భవిష్యత్తు మరియు పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా హుజురాబాద్‌లో ఏర్పాటు చేయాలనుకుంటున్న డంపింగ్ యార్డ్‌ను వెంటనే రద్దు చేయాలని కలెక్టర్ ని కోరారు.ఎమ్మెల్యే తో SC కార్పొరేషన్ మాజీ చెర్మన్ బండ శ్రీనివాస్,మున్సిపల్ చెర్మన్ ప్రశాంత్ కుమార్,కౌన్సిలర్ రవీందర్ రావు రాజపల్లి సర్పంచ్ మల్లరెడ్డి,మాజీ ఎంపీపీ సురేందర్ రెడ్డి మాజీ PACS చెర్మన్ కొండల్ రెడ్డి మాజీ కౌన్సిలర్ RK రమేష్ ఉప సర్పంచ్ సతీష్,శ్రీనివాస్ ఉన్నారు













