+91 99635 77856

మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిస్తాం

Kudikala Sai Editor
maaksharamnews.in

మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిస్తాం

- ఘనంగా 200వ జయంతి వేడుకలు..

- విద్య సమాన హక్కు నినాదం పూలే దంపతులదే...

హుజురాబాద్/ ఏప్రిల్ 11 (మా అక్షరం):సమాజంలో విద్య అందరికీ సమాన హక్కు కావాలని, కుల, మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికీ విద్య అందించాలనే లక్ష్యంతో పనిచేసిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే అని హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శనివారం పట్టణంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం మాట్లాడుతూ డా. బి.ఆర్. అంబేద్కర్ వంటి మహనీయులు కూడా పూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. రానున్న తరాలకు మహనీయుల గురించి తెలియజేయడంలో ఇలాంటి జయంతి వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.హుజురాబాద్‌లో మహాత్మా పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని కమిటీ సభ్యులు కోరగా, దీనిపై సానుకూలంగా స్పందించారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా వ్యవస్థ మరింత బలోపేతం అవుతోందని, ప్రభుత్వ పాఠశాలలు, పూలే విద్యాలయాలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పీసీసీ పరిశీలకులు, మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు, జయంతి కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

– ఘనంగా 200వ జయంతి వేడుకలు..

– విద్య సమాన హక్కు నినాదం పూలే దంపతులదే…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !