+91 99635 77856

ఘనంగా వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థుల వీడ్కోలు వేడుకలు

హుజురాబాద్/ ఏప్రిల్ 11( మా అక్షరం):స్థానిక శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని శనివారం సాయిరూప ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల కరస్పాండెంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.ప్రస్తుత పోటీ ప్రపంచంలో అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, విద్యార్థులు తమ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని మంచి ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని సూచించారు.కళాశాల ప్రిన్సిపాల్ బొక్కల ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి ఫీ రీయింబర్స్‌మెంట్ అందకపోయినా, విద్యార్థుల నుంచి ఎటువంటి ఫీజులు తీసుకోకుండా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులై జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా కళాశాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థుల నృత్య ప్రదర్శనలు కార్యక్రమానికి ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కొలిపాక రమేష్, రామరాపు భద్రయ్య, వేముల శ్రీనివాస్, చందా వెంకటేష్, సురేష్, మేకల నవీన్ కుమార్, శ్రీనివాస్, స్వప్న, ప్రియాంక తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !