ఎల్కతుర్తి మండలం పెంచికలపేట, గ్రామం లో వ్యవసాయ కళాశాల మరియు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ వారి అధ్వర్యంలో వానాకాలం సాగుకు రైతులను సమాయత్తం చేసేందుకు “రైతు ముంగిట శాస్త్రవేత్తలు అనే రైతు అవగాహన కార్యక్రమం” గ్రామ పంచాయతీ “లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో. డాక్టర్ ఐ. శకుంతల దేవి , అసిస్టెంట్ ప్రొఫెసర్,మాట్లాడుతూ యూరియా వాడకాన్ని తగ్గించడం, అవసరం మేరకు వినియోగించి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడడం, పచ్చి రొట్ట ఎరువుల ప్రాధాన్యం, వివిధ పంటల్లో సాగునీటిని ఆదా చేయడానికి ఉపయోగించే పరిజ్ఞానాన్ని మరియు పంట మార్పిడి యొక్క ప్రాముఖ్యత పై అవగాహన కల్పించారు.శ్రీమతి కే.గోపిక,వృక్ష వ్యాధి శస్త్రం, అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు మాట్లాడుతూ వివిధ పంటల లో వచ్చే తెగుళ్లు మరియు ఆశించే పురుగులు వాటి నివారణ చర్యలను, వివిధ రకాల జీవ నియంత్రణ కారకాలను వాటిని ఉపయోగించడం వలన పర్యావరణo లో జరిగే మార్పులను గురించి రైతులకు వివరించడం జరిగింది. తరువాత శ్రీ టి. తిరుపతి గారు వ్యవసాయ విస్తరణ అధికారి మాట్లాడుతూ ఎరువుల యాజమాన్యం మరియు నేల ఆరోగ్యాన్ని కాపాడడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు జనుము, జీలుగా విత్తన లభ్యత మరియు రాష్ట్ర ప్రభుత్వం నుండి లభించే సబ్సిడీలను గురించి వివరించడం జరిగింది. ఈఆయిల్ ఫెడ్ ఫీల్డ్ ఆఫీసర్ జి . ప్రభావతి గారు ఆయిల్ పామ్ క్రాప్ సబ్సిడీ, మరియు పంట ప్రాముఖ్యత ,దిగుబడుల గూర్చి ను గూర్చి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీమతి ముప్పు శైలజ, సర్పంచ్ ,ఉప సర్పంచ్ శ్రీ.ఎం.అశోక్, మరియు వ్యవసాయ కళాశాల రెండవ సంవత్సరం విద్యార్థులు ఆర్.ఇందుప్రియా, పి.హర్షిత మరియు 56 మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతo చేయడం జరిగింది.












