+91 99635 77856

హుజురాబాద్ వాసికి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు

Kudikala Sai Editor
maaksharamnews.in

హుజురాబాద్ వాసికి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు

హుజురాబాద్/ఆగస్టు 15 (మా అక్షరం): పట్టణానికి చెందిన మాటూరి రాజేష్‌కు ఉత్తమ ఉద్యోగి (బెస్ట్ ఎంప్లాయ్) అవార్డు లభించింది. శనివారం జరిగిన కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు.ప్రస్తుతం రాజేష్ ములుగు జిల్లాలోని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణ, సమయపాలనతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నందుకు ఆయనను ఉత్తమ ఉద్యోగిగా ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు.రాజేష్ గతంలోనూ మూడు పర్యాయాలు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డులు అందుకున్నారు. వరుసగా ఉత్తమ ఉద్యోగి పురస్కారాలు అందుకుంటూ హుజురాబాద్ ప్రాంతానికి మంచి పేరు తీసుకువస్తున్న రాజేష్‌ను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా సీనియర్, జూనియర్ హాకీ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేసి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !