+91 99635 77856

పదేళ్లు ప్రజలను మోసం చేసిన బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ను విమర్శించే హక్కు లేదు

Kudikala Sai Editor
maaksharamnews.in

పదేళ్లు ప్రజలను మోసం చేసిన బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ను విమర్శించే హక్కు లేదు

హుజూరాబాద్ /సెప్టెంబరు 03 (మా అక్షరం): పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలను మోసం చేసి.. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రజాపాలనపై ధర్నాలు, విమర్శలు చేయడం సిగ్గుచేటని జిల్లా కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి నేరెళ్ల మహేందర్‌గౌడ్‌ అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.జమ్మికుంట బహిరంగ సభలో రూ.1,000 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి.. వెయ్యి రోజులు గడిచినా కనీసం రూ.1,000 కూడా తీసుకురాలేదని ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై చిల్లర విమర్శలు చేయడం సరికాదన్నారు.ప్రభుత్వ అధికారిక క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్‌ ఫొటోను తొలగించి.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో తామే తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందిస్తుంటే.. అవి అందడం లేదని ఎమ్మెల్యే విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో హామీ ఇచ్చిన దళిత ముఖ్యమంత్రి, నిరుద్యోగ భృతి, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి హామీల పరిస్థితి ఏమైందో ప్రజలకు చెప్పాలని మహేందర్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు.కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు, ప్రచారాన్ని మానుకుని.. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి చేయాలని సూచించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !