+91 99635 77856

హుజురాబాద్‌లో కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ

Kudikala Sai Editor
maaksharamnews.in

హుజురాబాద్‌లో కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ

హుజురాబాద్/ సెప్టెంబరు 03 (మా అక్షరం) : కాంగ్రెస్‌ ప్రభుత్వం 1,000 రోజుల ప్రజాపాలన పూర్తిచేసుకున్న సందర్భంగా హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. గురువారం నియోజకవర్గ ఇన్‌ఛార్జి వొడితల ప్రణవ్‌ ఆదేశాల మేరకు స్థానిక కాంగ్రెస్‌ కార్యాలయం నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు సుమారు 500 మందితో ర్యాలీ చేపట్టారు. బాణసంచా కాల్చి, కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు.

కౌశిక్‌రెడ్డి అభివృద్ధి నిరోధకుడు

కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసా, రుణమాఫీ, రైతులకు రూ.500 బోనస్‌, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రేషన్‌ కార్డులు, ఆరోగ్యశ్రీ తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని నాయకులు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి 1,000 రోజుల్లో హుజురాబాద్‌ అభివృద్ధికి ఎలాంటి నిధులు తీసుకురాలేదని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్‌, ప్రణవ్‌తోనే సాధ్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుహాసిని, వైస్‌ చైర్‌పర్సన్‌ అంజలి, కౌన్సిలర్లు, జిల్లా కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి నేరెళ్ల మహేందర్‌గౌడ్‌,కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సొల్లు బాబు, కాంగ్రెస్‌ నాయకులు,మహిళా,యువజన, మైనారిటీ, ఎన్‌ఎస్‌యూఐ, సేవాదళ్‌, సోషల్‌ మీడియా విభాగాల నాయకులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !