+91 99635 77856

గణేశ నిమజ్జనానికి నీటి కష్టాలు.. ఎస్సారెస్పీ కాలువలోకి నీటిని విడుదల చేయాలి

Kudikala Sai Editor
maaksharamnews.in

గణేశ నిమజ్జనానికి నీటి కష్టాలు.. ఎస్సారెస్పీ కాలువలోకి నీటిని విడుదల చేయాలి

-జిల్లా మంత్రులు, ఇన్‌చార్జి మంత్రి, అధికారులు స్పందించాలి: బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకుడు వర్ధినేని రవీందర్ రావు...

హుజురాబాద్ /సెప్టెంబర్ 22 (మా అక్షరం): గణేశ నిమజ్జనానికి అవసరమైన నీరు అందుబాటులో లేకపోవడం పట్ల హుజురాబాద్ బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకుడు, 12వ వార్డు కౌన్సిలర్ వర్ధినేని రవీందర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. నిమజ్జనం నిర్వహించాల్సిన ప్రాంతంలో కనీసం ఒక్క చుక్క నీరు కూడా లేని పరిస్థితి నెలకొందని, ఈ సమస్యను జిల్లా మంత్రులు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి, సంబంధిత అధికారులు తక్షణమే గమనించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.గణేశ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా భక్తులు గణనాథులను భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో నీటి కొరత ఏర్పడటం ఆందోళనకరమన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం, అధికారులు సమన్వయంతో స్పందించాలని కోరారు.హుజురాబాద్‌లోని ఎస్సారెస్పీ కాలువలోకి తక్షణమే నీటిని విడుదల చేసి గణేశ నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని వర్ధినేని రవీందర్ రావు విజ్ఞప్తి చేశారు. పండుగ వాతావరణానికి ఆటంకం కలగకుండా అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి భక్తుల సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

Share ePaper Clip

Preparing image...

-జిల్లా మంత్రులు, ఇన్‌చార్జి మంత్రి, అధికారులు స్పందించాలి: బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకుడు వర్ధినేని రవీందర్ రావు…

హుజురాబాద్ /సెప్టెంబర్ 22 (మా అక్షరం): గణేశ నిమజ్జనానికి అవసరమైన నీరు అందుబాటులో లేకపోవడం పట్ల హుజురాబాద్ బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకుడు, 12వ వార్డు కౌన్సిలర్ వర్ధినేని రవీందర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. నిమజ్జనం నిర్వహించాల్సిన ప్రాంతంలో కనీసం ఒక్క చుక్క నీరు కూడా లేని పరిస్థితి నెలకొందని, ఈ సమస్యను జిల్లా మంత్రులు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి, సంబంధిత అధికారులు తక్షణమే గమనించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.గణేశ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా భక్తులు గణనాథులను భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో నీటి కొరత ఏర్పడటం ఆందోళనకరమన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం, అధికారులు సమన్వయంతో స్పందించాలని కోరారు.హుజురాబాద్‌లోని ఎస్సారెస్పీ కాలువలోకి తక్షణమే నీటిని విడుదల చేసి గణేశ నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని వర్ధినేని రవీందర్ రావు విజ్ఞప్తి చేశారు. పండుగ వాతావరణానికి ఆటంకం కలగకుండా అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి భక్తుల సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !